Site icon desh 24×7

ప్రేమ వివాహం.. నవవధువు బలి

పెళ్లైన 20 రోజులకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి మండలం చీమల కొండూరుకి చెందిన బిట్కురి మనోహర్, పల్లెర్ల భూమిక గత నెల 17న ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహిత మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అత్తింటి వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడిందని శనివారం కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version